తమిళసినిమా: ప్రతిభకు అంగవైకల్యం ఆటంకం కాదని ఇంతకు ముందు చాలా మంది నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. ప్రయత్నిస్తే పోయేదేముంది మహా అయితే ఫలిస్తుంది తప్పా.. అన్న విధంగా ఇలా పుట్టుకతోనే ఒక చెయ్యి పొట్టిగా అంగవైకల్యంతో పుట్టిన ఒక చిన్నారి ఏమాత్రం తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా రెండవ చేతితోనే తనలోని ప్రతిభను చాటుకుంటుంతోంది. ఆ చిన్నారి ప్రముఖ నటి సిమ్రాన్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ 10 ఏళ్ల చిన్నారి పేరు నిషా. ఈమె నటి సిమ్రాన్ చిత్రాల పాటలను టీవీల్లో చూసి ఆకర్షితురాలై ఆమె మాదిరిగానే డాన్స్ చేయడంలో శిక్షణ పొందిందింది. ఆమెలోని ఈ ప్రతిభను చూసిన ఆషిక్ అనే సామాజిక సేవకుడు ఆమె డానన్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చెశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. అంతేకాకుండా ఆషిక్ చిన్నారి నిషా ప్రతిభ గురించి, ఆమె కుటుంబ పరిస్థితుల గురించి నటి సిమ్రాన్ దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా పాఠశాలకు వెళ్లడానికి ఒక సైకిల్ కావాలనే నిషా చిరకాల కోరికను సిమ్రాన్‌కు విన్నవించారు. దీంతో చిన్నారి నిషాను తన వద్దకు పిలుచుకున్న నటి సిమ్రాన్ తన పాటలకు ఆ చిన్నారితో కలిసి డాన్స్ చేసి ఆనందించారు. డానన్స్‌లో నిషా ప్రతిభను అభినందించడంతో పాటు చదువుపై శ్రద్ధ చూపాలని విద్య ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం నిషా చిరకాల కోరిక అయిన సైకిల్‌ను బహుమతిగా అందించి ఆమెను సంతోష పరిచారు.


