‘లైట్‌ వెయిట్‌ బేబీ’ షూటింగ్‌ పూర్తి | - | Sakshi
Sakshi News home page

‘లైట్‌ వెయిట్‌ బేబీ’ షూటింగ్‌ పూర్తి

Jul 30 2026 4:36 AM | Updated on Jul 30 2026 4:36 AM

లైట్‌ వెయిట్‌ బేబీ చిత్ర యూనిట్‌

తమిళసినిమా: స్టాండ్‌ ఆఫ్‌ కమెడియన్‌ విక్కల్స్‌ విక్రమ్‌, ఫిట్నెస్‌ స్పెషలిస్ట్‌ ఆర్తీ కృష్ణ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం లైట్‌ వెయిట్‌ బేబీ. హిత స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర సంతోష్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కేసీ గురు కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేస్తుకున్నట్లు యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. చిత్రదాసకుడు కేసీ గురు తెలుపుతూ గత 45 రోజులుగా ఈ చిత్ర షూటింగ్‌ పయనం అద్భుతంగా అమిరిందని అన్నారు. షూటింగ్‌ నిర్వహించిన ఒక్కో నగరంలో ఒక్కో ప్రత్యేక అంశం జరిగిందన్నారు. వేరు వేరు రంగాలకు చెందిన ఇద్దరి గురించిన భావాలను ఆవిష్కరించే విధంగా ప్రారంభమైన కథా చిత్రం నిజంగా తాము గర్వపడే విధంగా రూపొందిందని చెప్పారు.

ప్రస్తుతం చిత్ర ఎటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ఈ చిత్రంలోని కథాపాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. తన సినీ రంగ ప్రవేశంలో కథానాయకుడిగా తన పయనం చాలా ఉత్సాహమైన అనుభవాన్ని ఇచ్చిన చిత్రం ఇదని నటుడు విక్కల్స్‌ విక్రమ్‌ పేర్కొన్నారు. కథానాయకుడిగా నటించడంతోపాటు సంభాషణలో రాసే అవకాశం కలగడం ప్రత్యేకం అన్నారు. ఇది ప్రేక్షకులకు సంతోషాన్ని, మనసుకు దగ్గరగా ఉండే అనుభూతిని కలిగించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఫిట్నెస్‌ అనేది తనకు శారీరకంగా ఎప్పుడు చాలెంజ్‌ గానే ఉంటుందని, అయితే నటన తనకు భావద్రేకాల పరంగా పూర్తిగా కొత్త సవాల్గా మారిందనో నటి ఆర్తీ కృష్ణ పేర్కొన్నారు. సుచిత్ర కథాపాత్రలో నటించడం తనకు వేరే పరిమాణాన్ని చూడ్డానికి సహకరించిందన్నారు. ఇందులో నటించిన ప్రతి విషయం తనకు మర్చిపోలేని అనుభవం అని ఆర్తి కృష్ణ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ప్రమోద్‌ కొట్టియన్‌ ఛాయాగ్రహణంను, సర్వనా సుబ్రమణియం సంకేతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement