ప్రభుత్వాసుపత్రిలో లంచావతారాలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రిలో లంచావతారాలు

Jul 30 2026 4:36 AM | Updated on Jul 30 2026 4:36 AM

● వీడియో వైరల్‌

వేలూరు: వేలూరు అడుక్కుంబరై ప్రభుత్వాసుపత్రిలోని సిబ్బంది ఒకరు లంచం తీసుకుంటున్న వీడియో వేలూరులో వైరల్‌ అవుతోంది. ఇటీవల కాలంలో ఒడుగత్తూరు సమీపంలోని ఓ అటవీ గ్రామానికి చెందిన ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని త్వరగా పోస్టుమార్టం చేసి ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది ఒకరు లంచం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో వేలూరులో సంచలనం రేపుతుంది. అక్కడ సిబ్బంది సాధారణంగా రూ. 2 వేలూరు నుంచి రూ. 5 వేలు వరకు లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సంబంధిత అఽధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వీటిపై జిల్లా వైద్యాధికారులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement