వేలూరులో తండ్రిని
హత్య చేసిన తనయుడు
వేలూరు: వేలూరు శలవన్‌పేట సమీపంలోని అమ్మనాగుట్టై ప్రాంతానికి చెందిన చంద్రన్(70) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు శక్తివేల్‌కు ఇద్దరు భార్యలున్నారు. మద్యానికి బానిసగా మారిన ఇతను పనికి వెళ్లకుండా భార్యలను చిత్ర హింసలు పెట్టడంతో ఇద్దరూ అతన్ని వదిలి పెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి రాత్రి సమయంలో తండ్రి, తనయుడు ఇద్దరూ కలిసి మద్యం సేవించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి తండ్రీ, తనయుడు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరికి వాగ్వాదం ఏర్పడి ఘర్షణ పడ్డారు. దీంతో ఆగ్రహించిన శక్తివేల్ ఇంటిలో ఉన్న కత్తిని తీసి తండ్రి చంద్రన్ గొంతుపై నరికాడు. తవ్ర గాయాలైన చంద్రన్ రక్తపు మడుగులో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే వేలూరు సౌత్ పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి శక్తివేల్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
శక్తిదేవి చారిటబుల్ ట్రస్ట్ రజతోత్సవం
తిరువొత్తియూరు: శక్తిదేవి చారిటబుల్ ట్రస్ట్ రజతోత్సవం (సిల్వర్ జూబ్లీ) వేడుకల సందర్భంగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్. మహాదేవన్ ముఖ్య అతిథిగా పాల్గొని, వివిధ రంగాలకు చెందిన 25 మంది ప్రముఖులకు అవార్డులు అందజేసి గౌరవించారు. ఈరోడ్‌కు చెందిన శక్తి మసాలా సంస్థ అనుబంధ విభాగమైన శక్తిదేవి చారిటబుల్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు మంగళవారం పెరుందురైలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో శక్తిదేవి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ, శక్తి మసాలా సంస్థల అధినేత పి.సి. దురైసామి, శాంతి దురైసామి తదితరులు పాల్గొని అందరికీ స్వాగతం పలికారు. ప్రత్యేక అతిథిగా చలనచిత్ర నటుడు ఆర్. శివకుమార్ పాల్గొని ప్రసంగించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహాదేవన్ ముఖ్య అతిథిగా విచ్చేసి, అవార్డులను ప్రదానం చేసి ప్రసంగించారు. సమాజంలో విశేష కృషి చేసిన మొత్తం 25 మంది ప్రముఖులకు అవార్డులు ఇచ్చి ఘనంగా సత్కరించారు. సామాజిక సంక్షేమం, ప్రజా సేవ, వైద్య సేవలు, విద్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలు లభించాయి.
ఉపాధి కూలీకి
రూ. 2.79 కోట్లు జీఎస్టీ
వేలూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని పుదూరు పడవేట్టమ్మన్ ఆలయ వీధికి చెందిన మురుగేశన్ భార్య రుక్మిణి. ఈమె ఉపాధి హామీ కార్మికురాలిగా పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సందకోడియూరు ప్రాంతంలోని ఓ బ్యాంకులో ఉపాధి హామీ కూలీ డబ్బు తీసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆంబూరు ప్రాంతంలోని ఆదాయపు పన్నుల శాఖ కార్యాలయం నుంచి ఓ నోటీసు వచ్చింది. అందులో మీరు ఆర్‌ఎం ట్రేడర్స్ నడుపుతున్నారని వాటి ద్వారా మీరు రూ. 2.79 కోట్ల జీఎస్‌టీ నగదు చెల్లించాల్సి ఉందని, ఇప్పటికే మీ ఖాతా ఉన్న బ్యాంకుకు నోటీసు పంపినట్లు వీటి కారణంగా మీ బ్యాంకు ఖాతా పూర్తిగా సీజ్ చేసినట్లు తెలిపారు. దీంతో వృద్ధురాలు రుక్మణి అవాకై ్క కన్నీరు మున్నీరయ్యారు. వీటిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని వాపోయింది.
పల్లికరనై నారాయణపురం సరస్సులో..
కొరుక్కుపేట: ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు, తమిళనాడు గ్రామీణాభివృద్ధి అండ్ జలవనరుల శాఖ గత 3 రోజులుగా చైన్నె , పరిసర ప్రాంతాల్లోని సరస్సులు, జలాశయాలలో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహిస్తోంది.ఆ విషయంలో, మంత్రి ఎన్. ఆనంద్ బుధవారం పల్లిక్కరనై నారాయణపురం చెరువు పూడికతీత, పునరుద్ధరణ పనులను ప్రారంభించి, బోట్ లైన్ యంత్రంతో చెరువులోకి వెళ్లి తనిఖీ నిర్వహించారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ చెరువు ఆకాశ తామరలతో నిండి ఉంది. నీటిపై తేలియాడే మొక్కలు, ఇతర పదార్థాలు వ్యాపించి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, వర్షాకాలం ప్రారంభమైనప్పుడు ప్రజలు వరదల వల్ల ప్రభావితమవుతారు. దీంతో వర్షాకాలానికి ముందే సరస్సును శుభ్రపరిచి పునరుద్ధరించాలని మంత్రి ఎన్. ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఫలితంగా నారాయణపురం సరస్సును పూర్తిగా పునరుద్ధరించారు. కాగా ఇక్కడ పర్యాటకన పడవలను ఏర్పాటు చేసే అంశంపై మంత్రి ఆనంద్ ముఖ్యమంత్రి విజయ్‌తో సంప్రదించగా, ఆయన ఆదేశాల మేరకు సరస్సులో పడవను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


