కీర్తీ ఇతను ఎవరమ్మా? ప్రేమికుడా, లేక నెటిజన్లు ట్రోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇతను ఎవరు కీర్తి

Jun 23 2023 1:52 AM | Updated on Jun 23 2023 12:38 PM

ఫ్రెండ్‌తో కీర్తిసురేష్‌  - Sakshi

ఫ్రెండ్‌తో కీర్తిసురేష్‌

తమిళసినిమా: నటీమణుల మీద రకరకాల వదంతులు రావడం సహజమే. ఇక్కడ నిప్పు లేనిదే పొగరాదు అనే సామెత కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ల ప్రేమ పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతుండడం, వాటిని వాళ్లు ఖండించడం షరా మామూలే. ఇటీవల ఇలాంటి ప్రచారం కీర్తిసురేష్‌పై ఎక్కువగా జరుగుతోంది. అనతి కాలంలోనే దక్షిణాది కథానాయకిగా పేరు తెచ్చుకున్న మలయాళీ కుట్టి ఈమె. ప్రారంభ దశలోనే మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి బయోపిక్‌లో అద్భుత అభినయాన్ని చాటి, విమర్శకులను సైతం మెప్పించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

అంతేకాకుండా చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇలా నటిగా సక్సెస్‌ఫుల్‌పై సాగిస్తున్న కీర్తిసురేష్‌ వ్యక్తిగతంగా నెటిజన్లు కార్నర్‌కు గుర్తించిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఈమైపె రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. కీర్తిసురేష్‌ ప్రేమలో పడిందని త్వరలోనే పెళ్లి బాజా మోగనుందని ఆ మధ్య ప్రచారం జరిగింది.

గోవాకు చెందిన ఒక వ్యాపారవేత్త ప్రేమలో పడిందని ఆ వ్యక్తితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని మరో వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ అయితే దానికి ఆమె తండ్రి సురేష్‌ వివరణ ఇచ్చారు. కీర్తిసురేష్‌తో ఉన్న వ్యక్తి తమ కుటుంబ సన్నిహితుడేనని తాము గోవాకు వెళ్లినప్పుడల్లా అతను తమకు అన్ని రకాలుగా సహకరిస్తారని, అయితే తను కీర్తిసురేష్‌ ప్రేమికుడు కాదని స్పష్టం చేశారు. లేకపోతే తాజాగా కీర్తిసురేష్‌ ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కీర్తీ ఇతను ఎవరమ్మా? ప్రేమికుడా, లేక స్నేహితుడా అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement