సాక్షి,చైన్నె : తమిళనాడు ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తమిళనాడు హౌసింగ్ బోర్డుకు సర్వేయర్లుగా ఎంపికై న 12 మంది అభ్యర్థులకు హౌసింగ్ బోర్డు చైర్మన్ వే. శివా బోర్డు ప్రధాన కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు.టీఎన్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షల ద్వారా తమిళనాడు హౌసింగ్ బోర్డులో ల్యాండ్ సర్వేయర్ పోస్టులకు ఎంపికై న 12 మందికి ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన గృహ సదుపాయాలను అందించడమే హౌసింగ్ బోర్డు ప్రధాన ధ్యేయంగా శివా పేర్కొన్నారు. ప్రస్తుతం బోర్డు ఆధ్వర్యంలో బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య కాంప్లెక్స్‌లు, ఆఫీసు సముదాయాలు , పునర్నిర్మాణ ప్రాజెక్టులు వేగవంతంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు.సంస్థ పనులు నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా ఏర్పడుతున్న ఖాళీలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెంటనే భర్తీ చేస్తోందని తెలిపారు. ఈ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో తమిళనాడు హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ , ఇతర బోర్డు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.


