హత్య కేసులో ఒకరి అరెస్ట్
తిరువొత్తియూరు: తిరువొత్తియూరు, టి.హెచ్. రోడ్డు ప్రాంతానికి చెందిన రవి కుమారుడు పవిత్రన్ ( 32). మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఇతనికి ఇంకా వివాహం కాలేదు. ఈ పరిస్థితిలో, సోమవారం రాత్రి పవిత్రన్ తన స్నేహితులతో కలిసి తిరువొత్తియూరు వన్నియర్ వీధిలో నిలబడి మాట్లాడుతున్నాడు. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సమీపంలో మరో వర్గానికి చెందిన కొందరు గంజాయి మత్తులో గట్టిగా మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. దీనిని పవిత్రన్ ఖండించాడు. దీని వల్ల ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఆగ్రహానికి లోనైన అవతలి ముఠా కత్తులతో పవిత్రన్‌పై దాడి చేశారు ఇందులో తల, ముఖంపై తీవ్రమైన గాయాలైన పవిత్రన్ అక్కడికక్కడే దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పవిత్రన్ స్నేహి తుడు మదన్ అనే వ్యక్తి కుడిచేతికి కూడా కత్తిపోట్లు తగిలాయి. వెంటనే ఆ హంతక ముఠా అక్కడి నుండి పారిపోయింది. ఈ విషయం గురించి సమాచారం అందిన వెంటనే తిరువొత్తియూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పవిత్రన్ మతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి తిరువొత్తియూ రు, వన్నియర్ వీధికి చెందిన బాలాజీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డాక్యుమెంట్ రైటర్ల ధర్నా
తిరుత్తణి: సంస్కరణల పేరుతో రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా తిరుత్తణిలోని డాక్యుమెంట్ రైటర్లు మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పేపర్ లెస్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం రద్దు చేయాలని కోరారు.
పాఠశాల జెండా స్తంభంపై ఖాళీ మద్యం సీసా
తిరువొత్తియూరు: తేనిలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసే జెండా స్తంభంపై ఎవరో ఆకతాయిలు ఖాళీ మద్యం ప్యాకెట్/సీసాను కట్టి వేలాడదీసిన దృశ్యం వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు వానతి శ్రీనివాసన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. మద్యం సమాజానికి పెద్ద శాపమని చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనం. తల్లి కంటే, మాతభూమిని ప్రాణం కంటే మిన్నగా భావించే దేశభక్తులు నివసించే మన దేశంలో, తేని జిల్లాలోని ఒక పాఠశాలలో జాతీయ జెండా ను ఎగురవేసే జెండా స్తంభంపై కొందరు దేశద్రోహ శక్తులు మద్యపు సీసాను కట్టి వేలాడదీశారనే వార్త జాతీయ జెండాకు, జెండా స్తంభానికి జరిగిన అతిపెద్ద అవమానం. ఇది తీవ్రంగా ఖండించదగినది. జాతీయ జెండాను కింద పడకుండా కాపాడి తన ప్రాణాలను త్యాగం చేసిన తిరు ప్పూర్ కుమరన్ జన్మించిన ఈ గడ్డపై, మద్యం వల్ల యువత పాడైపోతుండటం చూస్తుంటే గుండె విలవిలలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సరికొత్తగా వోక్స్‌వ్యాగన్ వర్టస్
సాక్షి, చైన్నె: ప్రీమియం సెడాన్ వర్టస్‌కు వోక్స్‌వ్యాగన్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్,డిజైన్ రూపాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమైంది. జూన్ 2022లో ప్రారంభమైనప్పటి నుండి జర్మన్ ఇంజనీరింగ్, అద్భుతమైన డ్రైవింగ్ డైనమిక్స్ , భద్రతతో సెడాన్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వర్టస్, ఇప్పుడు మరింత మోడరన్ లుక్‌తో అలరించనుంది. నవీకరించబడిన వర్టస్ డిజైన్ త్రిభుజాకార జ్యామితి ఆధారంగా రూపొందించబడింది. ఇది కారుకు కచ్చితత్వం, సమతుల్యత , చైతన్యాన్ని అందిస్తూ మరింత పదునైన, సమకాలీన రూపాన్ని ఇస్తుంది. వర్టస్‌ను ప్రత్యేకంగా నిలిపే శక్తివంతమైన జర్మన్ ఇంజనీరింగ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ , డ్రైవింగ్ ఆనందాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే ఈ విజువల్ అప్‌డేట్ ఇచ్చారు.భారత మార్కెట్‌కు సరికొత్త వర్టస్‌ను పరిచయం చేస్తున్నందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని ఈసందర్భంగా వోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్‌కోహ్లి వివరించారు. వోవర్టస్ తన కస్టమర్లతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా, స్టైలిష్ మరియు పర్ఫార్మెన్స్–ఆధారిత సెడాన్‌గా నిలిచిందన్నారు. ఈ కొత్త వర్టస్ ద్వారా మా వినియోగదారులకు మరింత ప్రీమియం డ్రైవింగ్ అనుభవాన్ని మరియు ఆనందాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
తిరువొత్తియూరు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చైన్నె సెక్రటేరియట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సెక్రటేరియట్ కాలనీ ఇన్ స్పెక్టర్ థామ్సన్ జేవియర్‌కు సమాచారం అందింది. దీని ఆధారంగా సోమ వారం మధ్యాహ్నం పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురిని పట్టుకుని తనిఖీ చేయగా, వారి వద్ద సుమారు రెండున్నర కిలోల గంజాయి లభించింది. దీంతో పట్టుబడిన ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా, వారు పురసైవాక్కం దిడీర్ నగర్ ప్రాంతానికి చెందిన సురేష్ అలియాస్ ముయల్‌కాదు అప్పు (22), సతీష్ కుమార్ అలియాస్ తాజా (24), పీటర్ అలియాస్ జపాన్ (19) అని తెలిసింది. వీరిపైపలు కేసులు ఉన్నాయని తెలిసింది.


