250 మందికి కాలేయమార్పిడి శస్త్రచికిత్స | - | Sakshi
Sakshi News home page

250 మందికి కాలేయమార్పిడి శస్త్రచికిత్స

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

– గ్లెనీగల్స్‌ హాస్పిటల్‌ అరుదైన ఘనత

సాక్షి,చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద 250కి పైగా కాలేయ మార్పిడులు చైన్నెలోని గ్లెనీగల్స్‌ ఆసుపత్రిలో విజయవంతంగా చేపట్టారు . ఇందులో100 మందికి పైగా పిల్లలకు పునర్జన్మ లభించటం విశేషం . తమిళనాడు ప్రభుత్వానికి, గ్లెనీగల్స్‌ ఆసుపత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపేందుకు లబ్ధిదారులు, దాతలు ఏకమయ్యారు.ఈమేరకు మంగళవారం ఆసుపత్రి ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగిందిజ. ఇందులో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షే మ శాఖ మంత్రి డాక్టర్‌ అరుణ్‌రాజ్‌ ముఖ్య అతిథిగా, ప్రత్యేక అతిథిగా షోలింగనల్లూరు ఎమ్మెల్యే పి. శరవణన్‌, పలువురు సీనియర్‌ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.ముందుగా ఈ పథకం కింద కాలేయ మార్పిడి చేయించుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కాలేయ దాతలతో కలిసి తమిళనాడులోని వివిధ జిల్లాల నుండి ఒకచోట చేరారు. వారు తమిళనాడు ప్రభుత్వానికి , ఆసు పత్రి యాజమాన్యానికి తమ కృతజ్ఞతలు తెలిపా రు. గ్లెనీగల్స్‌ హాస్పిటల్‌ (ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ నెట్‌వర్క్‌ లో ఒక భాగం), వైద్యులు డాక్టర్‌ జాయ్‌ వర్గీస్‌ తో పాటు అతని అంకితభావంతో కూడిన కాలేయ మా ర్పిడి బృందం అద్భుతమైన కృషికి ధన్యవాదా లు తెలియజేశారు. తమిళనాడు ప్రభుత్వ వైద్య విద్యా శాఖ సంచాలకులు డాక్టర్‌ ఎ. అరవింద్‌, ఆసుపత్రి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎస్‌. నిరంజని హాజరయ్యారు.2018 నుండి, ఈ కార్యక్రమం కింద 250కి పైగా కాలేయ మార్పిడులు విజయవంతంగా నిర్వహించబడ్డాయి, వాటిలో 100కి పైగా పిల్లలకు జరిగిన కాలేయ మార్పిడిలు ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement