కొరుక్కుపేట: జనని సంస్థ ఆధ్వర్యంలో చైన్నె వ్యాసర్పాడి మహాకవి భారతి నగర్ లో సిపి బ్రౌన్ 228వ జయంతిని ఘనంగా మంగళవారం నిర్వహించారు. సిపి బ్రౌన్ చిత్రపటానికి జనని అధ్యక్షురాలు డాక్టర్ నిర్మల పళనివేలు, ప్రదాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్యతోపాటు తెలుగు ప్రముఖులు, విశ్రాంత జనరల్ మేనేజర్ వంజరపు శివయ్య, డి.రాజేంద్రప్రసాద్‌లు పాల్గొని పుష్పాంజలి సమర్పించారు. అనంతరం డాక్టర్ నిర్మల పలనివేలు మాట్లాడుతూ తెలుగు భాషోద్దారకులు సి పి బ్రౌన్ తెలుగు భాషకు సేవ చేసిన సేవను ప్రపంచం యావత్తు హర్షించిందని కొనియాడారు . శివయ్య మాట్లాడుతూ ఆంధ్ర మహాభారతం, మహాభారతం భాగవతం వంటి మన కావ్యాలను ముద్రించే ప్రక్రియలో వారి కృషి గణనీయమైనదని ప్రసంశించారు. డి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కడపలో తెలుగు భాషా సేవకు నిదర్శనంగా వారి పేర సీపీ బ్రౌన్ గ్రంథాలయము అక్కడ వెలిసి ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం అని , చివరిగా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన గుడిమెట్ల చెన్నయ్య సిపి బ్రౌన్‌ను స్మరించుకోవటం నిజంగా మహదానందంగా ఉందని , ఆయన ఒక సాహితీ సంరక్షకుడు అని కొనియాడారు.


