వేలూరు: వేలూరు శ్రీపురం బంగారుగుడిలో ప్రపంచ శాంతి కోసం 10,008 దీపాల పూజ సోమవారం రాత్రి కనులపండువగా జరిగింది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఏటా దీపారాధన పూజ లను శ్రీనారాయణి పీఠాధిపతి శక్తిఅమ్మ అధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా బంగారుగుడిలో నక్షత్ర ఆకారంలో 10,008 నేతి దీపాలను వెలిగించారు. ముందుగా శ్రీనారాయణి అమ్మవారికి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజ లు, అభిషేకాలు, అలంకరణ, గోపూజ, తులసి పూజ, యాగపూజ, ఆశ్వపూజలు అతి వైభవంగా జరిగింది. అనంతరం నారాయణి అమ్మవారికి ఊంజల్ సేవను శక్తిఅమ్మ చేతుల మీదుగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పీఠాధి పతి శక్తిఅమ్మ నక్షత్ర ఆకారంలో వెలిగించిన దీపాల వద్దకు వెళ్లి ప్రత్యేక యాగం చేశారు. ప్రపంచంలో దీవావళి పండుగ రోజున ఎటువంటి అలజడి, ప్రమాదాలు జరకుండా కాపాడాలని, ప్రజలను సుఖ సంతోషాలతో వుంచాలని యాగ పూజలు నిర్వహించారు. నక్షత్ర ఆకారంలో వున్న దీపాలను తీసుకొచ్చి భక్తులకు హారతిగా ఇచ్చారు. అనంతరం నారాయణి అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. వేద మంత్రా లు, మేళ తాళాలతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో నారాయణి ఆసుపత్రి డైరెక్టర్ బాలాజి, బంగారుగుడి డైరెక్టర్ సురేష్ బాబు, మేనేజర్ సంపత్, బంగారుగుడి ఆంధ్ర రాష్ట్ర పీఆర్ఒ కళ్యాణ్, శక్తి అమ్మ భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొని శక్తి అమ్మకు పుష్పాలు సమర్పించి స్వామి వారి ఆశీర్వాదములు పొందారు.


