3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో.. | - | Sakshi
Sakshi News home page

3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో వెంబడించి...

May 5 2023 2:10 AM | Updated on May 5 2023 5:42 PM

- - Sakshi

అన్నానగర్‌ (తమిళనాడు): కళ్లకురిచ్చి సమీపంలోని మొవన్నంజూర్‌ గ్రామానికి చెందిన విజయా (20)కి పల్లక్కచేరి గ్రామానికి చెందిన మురుగన్‌ (25)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. తర్వాత కేవలం 3 నెలలు మాత్రమే వీరిద్దరూ భార్యాభర్తలుగా జీవించారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విజయా తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. అయితే మురుగన్‌ తన ఇంటికి రావాలంటూ విజయాను చాలాసార్లు పిలిచాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది.

ఇదే సమయంలో కడలూరు జిల్లా సిరుపాక్కం గ్రామానికి చెందిన మురుగన్‌ బంధువు మాయవన్‌తో విజయాకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ నిత్యం కలుస్తుండడంతో కోపొద్రిక్తుడైన మురుగన్‌ బుధవారం సాయంత్రం విజయ కల్లకురిచ్చి బస్‌ స్టేషన్‌ నుంచి ప్రైవేట్‌ మినీ బస్సులో ప్రయాణిస్తున్న భార్య విజయాను వెంబడించాడు.

బస్సు దిగి విజయ వెళ్తుండగా జోరు వానలో ఒక్కసారిగా ఆమైపె కత్తితో దాడి చేశాడు. రక్తపుమడుగులో విజయ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు మురుగన్‌పై దాడి చేయడంతో కళ్లకురిచ్చి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement