మద్యం మత్తులో కారు యాక్సిడెంట్‌.. హీరోయిన్‌ అరెస్టుకు కోర్టు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కారు యాక్సిడెంట్‌.. హీరోయిన్‌ అరెస్టుకు కోర్టు ఆదేశం

Mar 24 2023 6:18 AM | Updated on Mar 25 2023 12:37 PM

- - Sakshi

సినీ నటి యాసికాకు చెంగల్పట్టు కోర్టు గురువారం పీటీ వారెంట్‌ జారీ చేసింది. బిగ్‌ బాస్‌తో ప్రేక్షకుల్లో గుర్తింపు పొంది, ఆ తదుపరి అనేక చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన నటి యాసికా. 2021లో మహాబలిపురం సమీపంలోని ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఆమె స్నేహితురాలు మరణించింది. ఈకేసు విచారణలో యాసిక మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది.



ఈ కేసు చెంగల్పట్టు కోర్టులో విచారణలో ఉంది. బుధవారం కేసు విచారణకు యాసికా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె రాలేదు. ఇప్పటికే పలుమార్లు ఆమె కేసు విచారణకు డుమ్మాకొట్టడంతో న్యాయమూర్తి కన్నెర్రజేశారు. పీటీ వారెంట్‌ను జారీ చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీసులను చెంగల్పట్టు కోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement