హుజూర్‌నగర్ : గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు గుర్తించి ప్రణాళికను రూపొందించుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ నరసింహులు సూచించారు. మంగళవారం మండలంలోని గోపాలపురంలో సర్పంచ్ నందిగామ శ్రీను అధ్యక్షతన నిర్వహించిన వికసిత్ గ్రామపంచాయతీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామపంచాయతీ ప్రణాళికపై పలు సూచనలు చేశారు. వీబీజీ రాంజీ పథకంలో అమలు చేయాల్సిన 375 రకాల పనులను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో సూర్యాపేట ఆర్‌డీఓ సన్యాసయ్య, ఎంపీడీఓ సుమంత్‌రెడ్డి, ఏపీఓ శైలజ, ఈసీ పున్న రవి, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఫ గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్
కమిషనర్ నరసింహులు


