జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా జరుపుకొనేలా పోలీసుశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీతో పర్యవేక్షణ చేయనున్నామని, జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులు, పట్టణాల్లో శోభయాత్రను నిరంతరం జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. పోలీస్‌శాఖతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా తమ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.


