తిరుమలగిరి(తుంగతుర్తి) : తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో బుధవారం రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లైశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. తాటిపాముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.5 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారని, అనంతరం రూ.16 కోట్లతో బిక్కేరు వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యామ్‌ను పరిశీలిస్తారని ఆర్డీఓ వేణుమాధవరావు తెలిపారు. మంగళవారం మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఓటర్లు తగిన ఆధారాలు సమర్పించాలి
అర్వపల్లి: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు బీఎల్‌ఓలకు తగిన ఆధారాలు సమర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ కోరారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్‌పై అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అర్హుల ఓట్లు పోకుండా బీఎల్‌ఓలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నాయబ్ తహసీల్దార్ సమ్మెట అఽశ్వని, గిర్దావర్లు ప్రసన్న, వెంకట్‌రెడ్డి, జీపీఓలు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
ఉమెన్స్ టీ–20 లీగ్‌కు కోదాడ విద్యార్థిని
కోదాడరూరల్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉమెన్స్(అండర్–23) సీనియర్ టీ– 20 లీగ్ పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన క్రీడాకారిణి పచ్చిపాల మహేశ్వరి ఎంపికై నట్లు కోచ్ సిద్దీఖ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో పాల్గొన్న మహేశ్వరి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. క్రీడాకారిణిని అకాడమీ గౌరవ అధ్యక్షుడు ఎండీ.సలీంషరీఫ్, అధ్యక్షుడు సురేష్, హామీద్, ఖాజామియా, నందకిషోర్ అభినందించారు.
ఆయిల్ పామ్ సాగుతో ఆర్థికాభివృద్ధి
అర్వపల్లి: ఆయిల్ పామ్ తోటల సాగుతో రైతులు ఆర్తికంగా అభివృద్ధి చెందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి తీగల నాగయ్య సూచించారు. మండలంలోని తిమ్మాపురంలో రైతులు సాగు చేసిన ఆయిల్‌పామ్ తో టలను మంగళవారం ఆయన సందర్శించారు. తోటల సాగుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తుందని, రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ప్రాంతీయ ఉద్యాన అధికారి వి.ప్రమిత, విస్తరణ అధికారులు ఉన్నారు.


