చిలుకూరు: శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెస ర్ డాక్టర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం చిలుకూరులోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శక్తి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పేస్ ఆన్ వీల్స్’ ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతరిక్ష ప్రయోగాలలో మన దేశానికి ప్రపచంలోనే మంచి గుర్తింపు ఉన్నదన్నారు. అంతరిక్ష ప్రయోగాలలో పాలుపంచుకునేందుకు యువత ముందుకు రావా లని కోరారు. ఉన్నత విద్యామండలి ప్రవేశపెడుతున్న నూతన కోర్సులు దేశ, విదేశాల కంటే దీటుగా ఉన్నాయన్నారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి స్పేస్ టెక్నాలజీ లాంటి కోర్సులు సైతం అందుబాటులో తెస్తామన్నారు. ఫేస్ బుక్‌తో నాలెడ్జి రాదని, బుక్స్ చదవడం వల్లనే విజ్ఞానం పెరుగుతుందన్నారు. అనంతరం స్పేస్‌పై విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా స్పేస్ ఆన్ వీల్స్ బస్‌ను, రాకెట్లు, గ్రహాలు, చంద్రయాన్ వంటి నమునాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో శక్తియూత్ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్‌రావు ఎన్‌ఆర్‌ఎస్‌ఈ స్టూడెంట్ అండ్ పబ్లిక్ అవుట్ రిచ్ డివిజన్ హెడ్ డాక్టర్ ఆర్. శ్రీనివాస్, ఎంపీడీఓ ముక్కపాటి నరసింహారావు, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఫ్యాక్స్ చైర్మన్ అలసకాని జనార్దన్, ఎంఈఓ శివకుమారి, హెచ్‌ఎంరాజారాం, శక్తి యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ఫ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి


