మునగాల: సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు, విద్యుత్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని క్షోభకు గురి చేస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్, సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మునగాలలో మహాధర్నా నిర్వహించారు. ఉదయం రైతులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి స్థానిక సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా దున్నపోతుకు వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. అనంతరం 65వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేవలం మాటలతో మభ్య పెడుతూ, తన స్వార్ధ రాజకీయాల ప్రయోజనాల కోసం సాగర్ ఆయకట్టును సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారన్నారు. సాగర్ ప్రాజెక్ట్‌లో నీరు ఉన్నప్పటికీ జూన్ 25 నుంచి రెండు విడుతలుగా నీటిని విడుదల చేసినప్పటికీ కోదాడ, హుజూర్‌నగర్ రైతులకు ఇవ్వకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించారన్నారు. రైతుల పోలాలు ఎండిపోతుంటే పట్టించుకోకుండా జాబ్‌మేళా పేరుతో హెలికాప్టర్లను షేర్ ఆటోలా వాడుతూ సగం క్యాబినెట్‌ను తీసుకువచ్చి విహారయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై న కాంగ్రెస్ ప్రభుత్వం సాగర్ ఆయకట్టుకు సాగునీటిని, బోరు బావులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేష్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఫ నీరు, కరెంటు ఇవ్వకుండా రైతులతో కన్నీరు పెట్టిస్తున్నరు
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
ఫ సాగుకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని మునగాల సబ్‌స్టేషన్ ముట్టడి


