భానుపురి(సూర్యాపేట) : ప్రజావాణిలో అందిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో మొత్తం 98 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం కోదాడ జాబ్ మేళా విజయంతానికి కృషిచేసిన అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఎస్‌ఓ మోహన్‌బాబు, డీడబ్ల్యూఓ నరసింహారావు, కమిషనర్ హనుమంత్‌రెడ్డి, పాల్గొన్నారు.
సేవా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
అక్టోబర్ 1న వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వృద్ధుల సాధికారతకు సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. www.wdsc.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించి సెప్టెంబర్ 25 సాయంత్రం 5గంటల లోగా హార్ట్‌కాపీని సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


