పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం : ఎస్పీ

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

సూర్యాపేటటౌన్‌ : పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తోందని ఎస్పీ నరసింహ అన్నారు. వర్షాకాలంలో విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బంది సౌకర్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పోలీస్‌ శాఖ నుంచి సూర్యాపేట జిల్లా పోలీస్‌ శాఖకు కేటాయించిన రెయిన్‌ కోట్స్‌ను ఎస్పీ సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, పోలీస్‌ సంఘం అధ్యక్షుడు రమేష్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కిరణ్‌, ఏఆర్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బాధితులకు భరోసా కల్పించాలి

వివిధ సమస్యలపై ఫిర్యాదులందించే బాధితులకు పోలీసులు భరోసా కల్పించి వేగంగా వాటిని పరిష్కరించాలని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్‌ ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ స్వయంగా వినుతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అందించే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement