సూర్యాపేట : జాతీయ రహదారి 65ను ఆనుకొని రైల్వే కారిడార్ నిర్మించడంతోపాటు సూర్యాపేటకు బుల్లెట్ రైలు రావాలనే డిమాండ్‌తో శుక్రవారం నిర్వహించే సూర్యాపేట బంద్‌ను విజయవంతం చేయాలని అఖిల పక్ష నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో సుమారు 200 బైకులపై 400 మంది నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సూర్యాపేట బంద్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎంజీ యూనివర్సిటీ
పీజీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) పరిధిలోని పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3 బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాలను రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి గురువారం విడుదల చేశారు. పీజీ 4వ సెమిస్టర్‌లో మొత్తం 1265 మంది విద్యార్థులకు 967 మంది, (76.44శాతం), బ్యాక్‌లాగ్‌లో మొదటి సెమిస్టర్‌లో 427 మంది విద్యార్థులకు 158 మంది (37శాతం), 2వ సెమిస్టర్‌లో 382 మందికి 65 మంది (17.02శాతం), 3వ సెమిస్టర్‌లో 34 మంది విద్యార్థులకు 168 మంది (48.84శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు సీఈఓ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను ఎంజీయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు డి.సంధ్యారాణి, కళ్యాణి, ప్రవళిక పాల్గొన్నారు.


