పట్టభద్రుల ఓటరు నమోదుకు షెడ్యూల్‌ | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఓటరు నమోదుకు షెడ్యూల్‌

Sep 18 2026 7:31 AM | Updated on Sep 18 2026 7:31 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వేడి మొదలు కానుంది. ఈ నియోజవర్గంలో ఓటరు జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈనెల 28వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వెంటనే నమోదు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 6వ తేదీ వరకు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉటుంది. నవంబర్‌ 20వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్‌ 10 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరించి, 25వ తేదీలోగా పరిష్కరిస్తారు. డిసెంబర్‌ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. గతంలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లుగా నమోదైన వారు కూడా మళ్లీ కొత్తగా ఫారం–18 ద్వారా పేరు నమోదు చేసుకోవాల్సిందే. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 2024 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు 4,63,839 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఎంత మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకుంటారో చూడాల్సిందే.

ఫ 28వ తేదీన నోటిఫికేషన్‌

ఫ డిసెంబర్‌ 30న తుది ఓటరు జాబితా

ఫ పాత ఓటర్లు కూడా నమోదు

చేసుకోవాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement