బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి
ఫ పోలీస్, ఆర్మీ శిక్షణ ఇస్తున్న రిటైర్డ్ జవాన్ సత్యనారాయణ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ షేర్ బంగ్లా ప్రాంతానికి చెందిన కొండోజు సత్యనారాయణ తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లో 28 ఏళ్ల పాటు సేవలు అందించిన ఆయన 2019లో పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు.
ఉచిత శిక్షణ.. అద్భుత ఫలితాలు..
నేటి సమాజంలో యువతలో క్రమశిక్షణను పెంపొందించి, దేశ రక్షణ పట్ల వారిలో బాధ్యతను పెంచాలనే బలమైన సంకల్పంతో 2020లో ‘జై జవాన్ ట్రైనింగ్ సెంటర్’ను సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా భారత సైన్యం (ఆర్మీ), నావికాదళం (నేవీ), వాయుసేన (ఎయిర్ ఫోర్స్), సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఐఏతో పాటు రాష్ట్ర పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అవసరమైన ఫిజికల్ ట్రైనింగ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. అభ్యర్థులకు ముందుగా ఫిజికల్ టెస్ట్ నిర్వహించి, వారి ఫిట్‌నెస్ పరిశీలించిన తర్వాతే అడ్మిషన్లు ఇస్తున్నారు.ఇప్పటివరకు ఈ సెంటర్ ద్వారా 250 మందికి పైగా శిక్షణ పొందగా.. ఏకంగా 72 మంది ఆర్మీ, వివిధ పోలీస్ ఉద్యోగాల్లో స్థిరపడటం ఆయన కృషికి నిదర్శనం.
అగ్నివీర్, పోలీస్ ఉద్యోగాల ఫిజికల్ ఈవెంట్స్ సాధించడం చాలా సవాల్‌తో కూడుకున్నది. అందుకోసం జై జవాన్ ట్రైనింగ్ సెంటర్‌లో సత్యనారాయణ సర్ ఇచ్చే శిక్షణ మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రూపాయి ఖర్చు లేకుండా మమ్మల్ని లక్ష్యం వైపు సార్ నడిపిస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం.
– చిందాల దేవాన్ష్
ఉద్యోగ సాధనకు కావాల్సిన సరైన క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్‌నెస్ ఇక్కడ లభిస్తోంది. సత్యనారాయణ సార్ ఇచ్చే మెళకువలు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కఠినమైన ఫిజికల్ ట్రైనింగ్ పొందుతున్నాం. యూనిఫామ్ రిక్రూట్‌మెంట్ ఈవెంట్లలో గెలవడానికి కావల్సి అన్ని మెళకువలను ఆయన ఉచితంగా నేర్పిస్తున్నారు.
– కట్ట శరత్‌కుమార్‌రెడ్డి
కేవలం అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సురక్షితమైన వాతావరణంలో, పూర్తి క్రమశిక్షణతో కూడిన శిక్షణ లభిస్తోంది. యూనిఫాం ఉద్యోగం సాధించడమే నా ధ్యేయం.
– ఆరూరి అంకిత
రామగిరి (నల్లగొండ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ నల్లగొండ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) పి. వెంకటేశం అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఆయన ఆఫర్ల వివరాలను వెల్లడించారు. ఫ్రీడమ్ ప్లాన్ కింద ఉచిత సిమ్‌తో పాటు రీఛార్జ్‌పై 24 రోజుల వ్యాలిడిటీ, రోజూ 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయన్నారు. రూ.2,399 ఇయర్లీ ప్లాన్‌పై అదనంగా 47రోజుల వ్యాలిడిటీతో మొత్తం 412 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చన్నారు. రూ.1,111 ప్లాన్ ద్వారా 200 ఎంబీపీఎస్ స్పీడ్, నెలకు 5,000 జీబీ డేటా మరియు 25కు పైగా ప్రీమియం ఓటీటీ యాక్సెస్ లభిస్తుందన్నారు. 2జీ, 3జీ వినియోగదారులు ఉచితంగా 4జీ సిమ్‌కు మారవచ్చన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా 500 లైవ్ ఛానళ్లతో ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ, శాటిలైట్ ఫోన్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. సమావేశంలో డీజీఎం మురళీకృష్ణారెడ్డి, ఐఎఫ్ భాస్కర్‌రెడ్డి, ఏజీఎంలు అశోక్, సదానందం, రాములు, వెంకన్న, దినేష్ పాల్గొన్నారు.


