సాయి స్మరణ.. జనగణమన | - | Sakshi
Sakshi News home page

సాయి స్మరణ.. జనగణమన

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

చింతపల్లి సాయి ఆలయంలో పూజల

అనంతరం జాతీయ గీతాలాపన

మర్రిగూడ(చింతపల్లి): చింతపల్లి మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయం ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని చాటుతోంది. ఆలయంలో ప్రతి రోజు ఉదయం ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతుండగా మధ్యాహ్నం సమయంలో భక్తులంతా కలిసి జాతీయ గీతం ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భక్తితోపాటు దేశభక్తిని మేళవిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణమంతా జాతీయ గీతంతో మార్మోగగా, భక్తుల్లో దేశంపై గౌరవభావం, ఐక్యత, సామరస్యాన్ని చాటేలా కార్యక్రమం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement