సూర్యాపేట : గ్రామాల్లో ధర్మ పరిరక్షణ, ప్రజల్లో భక్తిభావం పెంపొందించే లక్ష్యంతో శ్రీరామ హృదయం కార్యక్రమాన్ని చేపట్టామని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని బాలాజీ బ్లాంకెట్ హాల్‌లో శ్రీరామ హృదయం సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాముని కరుణ, ఆశీర్వాదాలు ప్రతి గ్రామానికి చేరేలా శ్రీరామ హృదయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికాస తరంగిణి సేవకులు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే ఏకోత్తర సహస్ర కలశాభిషేకం (1001 కలశాలతో అభిషేకం) విశిష్టమైన ఆధ్యాత్మిక మహోత్సవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మురళీధరచార్యులు, రామానుజచార్యులు, అశోక్ రావు, శ్రీనివాస్ రెడ్డి, భాస్కరరావు, చకీలం వేణుగోపాల్, ఈశ్వర్ రెడ్డి, నిర్మల, విజయకుమార్ గురవయ్య, మల్లికార్జున్, శ్రీధర్, రవీందర్ భక్తులు పాల్గొన్నారు.
ఫ త్రిదండి అహోబిల
రామానుజ జీయర్ స్వామి


