పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం
కోదాడ : అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలనడం అన్యాయమని, పేదలకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోనని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ఇటీవల అధికారులు నోటీసులు ఇచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆదివారం బాధితులతో కలిసి మాట్లాడారు. పేదలు ఈ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని చెప్పారు. అధికారులు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలన్నారు. ఆయన వెంట నాయకులు ఎస్‌కే. నయీం, చింతల నాగేశ్వర్‌రావు, కర్ల సుందర్‌బాబు ఉన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య


