పొగమంచులో వాహనదారులు జాగ్రత్త
సూర్యాపేటటౌన్ : ప్రస్తుతం చలితీవ్రత పెరగడంతో పాటు రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా కురుస్తున్నదని, దాంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. పొగమంచు ప్రభావం వల్ల రోడ్లపై ముందు ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు రహదారుల వెంట నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వాహదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫ వాహనదారులు లైటింగ్ కండిషన్ సరి
చూసుకోవాలి.
ఫ తక్కువ వేగంతో డ్రైవ్ చేయాలి, మ్యూజిక్ పెట్టుకోవద్దు. ఖచ్చితమైన మార్గంలో ఒకే లైన్‌లో వాహనం నడపాలి.
ఫ ద్విచక్రవాహదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హై–భీమ్ కాకుండా, లో–భీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి.
ఫ వేగం తగ్గించి ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి.
ఫ రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వినియోగించాలి.
ఫ సడన్ బ్రేకులు వేయవద్దు. ఇలా వేస్తే రోడ్డు తడిగా ఉంటే స్కిడ్ అయ్యో ప్రమాదం ఉంటుంది.
ఫ టర్నింగ్ అయ్యో ముందు ఇండికేటర్ వేయాలి. వాహన వేగాన్ని తగ్గించాలి.
ఫ రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఉంటుంది. అందుకే ఆ సమయాల్లో ప్రయాణాలు చేయక పోవడమే మంచిది.
ఫ చేతులకు గ్లౌజ్‌లు తప్పనిసరిగా ధరించాలి. చేతులు చల్లబడితే వాహన నియంత్రణ తగ్గుతుంది.
ఫ కార్లు, పెద్ద వాహనాల డ్రైవర్లు ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3–4 రెట్లు ఎక్కువ దూరంగా ఉండాలి.
ఫ డిఫాగర్ ఉపయోగించాలి, విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ నివారించాలి.
ఫ హాజర్డ్ లైట్లు విజిబులిటీ తక్కువగా ఉన్నప్పుడు వాడాలి.
ఫ పొగమంచు ప్రాంతాల్లో ఓవర్‌టేక్ చేయవద్దు. లైన్ మార్కింగ్‌ను గమనిస్తూ నడపాలి.
ఫ వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది ముందుగానే తనిఖీ చేసుకోవాలి.
ఫ ఎస్పీ నరసింహ


