ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్‌లు నిర్వహణ లేక నీరసించిపోతున్నాయి. పర్యవేక్షణ లోపంతో పరికరాలు మూలనపడుతున్నాయి.
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా..
సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ పట్టణాల్లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. నేరేడుచర్ల,
తిరుమలగిరి పట్టణాల్లో ఏర్పాటు చేయలేదు. అయితే ఓపెన్ జిమ్‌లు ఉన్న మున్సిపాలిటీల్లోనూ వాటి పరిస్థితి గాలిలో దీపంలా మారింది.
సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తుండడంతో వ్యాయామ పరికరాలు
పాడైపోతున్నాయి.
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో 2018లో సీడీఎంఏ ఆధ్వర్యంలో రెండు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. వాటి వల్ల ప్రజలకు ఉపయోగం ఉండడంతో ప్రభుత్వం 2022లో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రూ.50 లక్షలతో మరో ఏడు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసింది. మొత్తంగా సూర్యాపేట పట్టణంలో తొమ్మిది ఓపెన్ జిమ్‌లు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణను అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి. కొత్తగా ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసిన చోట సిమెంట్ ఫ్లోరింగ్‌పై రబ్బర్ షీట్లు వేశారు. వాటిని గమ్‌తో అతికించడంతో కొన్నాళ్లకే ఊడిపోయాయి. వర్షం పడితే పైకి తేలుతున్నాయి. వీటిపై విమర్శలు రావడంతో అధికారులు మెత్తటి టైల్స్ వేయడం ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో ప్రస్తుతం కొన్ని వస్తువులు శిథిలావస్థకు చేరుకున్నాయి. సమస్య గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓపెన్ జిమ్‌కు వచ్చే వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినా పార్కుకు తాళాలు వేస్తుండడంతో అక్కడికి వెళ్లే స్థానికులు ఓపెన్ జిమ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు.
కోదాడ: నాలుగు సంవత్సరాల క్రితం కోదాడలోని గాంధీ పార్కు ఆవరణలో రూ.5లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నాణ్యతలేని పరికరాలు కావడంతో సంవత్సరం లోపే అవి పాడైపోయాయి. కింద వేసిన ఫ్లోర్ కూడా పాడైపోయింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వాటిని తొలగించి గాంధీ పార్కును ఆధునీకరిస్తున్నామని మరో రూ.25 లక్షలు ఖర్చు చేసి ఓపెన్‌జిమ్ స్థానంలో పిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాల ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. దీంతో ఓపెన్‌జిమ్ ఆనవాలు లేకుండా పోయింది.
పరికరాల్లో లోపించిన నాణ్యత
హుజూర్‌నగర్: హుజూర్‌నగర్‌లో గత ప్రభుత్వ హయాంలో రెండు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని గాంధీ పార్క్ సెంటర్‌లో, ఫణిగిరి గుట్టకు వెళ్లే దారిలో ఈ జిమ్‌లు ఉన్నాయి. ఒక్కో జిమ్‌లో దాదాపు రూ. 10 లక్షలు వెచ్చించి వ్యాయామ పరికరాలు, నేలపై మ్యాట్‌లను ఏర్పాటు చేశారు. నాణ్యత లేని వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు నిర్వహణ లేక పరికరాలు చాలావరకు సరిగా పనిచేయడం లేదు. ఫ్లోర్ మ్యాట్‌లు కూడా పాడైపోయాయి. ప్రస్తుతం ఆయా జిమ్‌లలో నేలపై ఏర్పాటు చేసిన మ్యాట్‌లు మాయమయ్యాయి. జిమ్‌కు వచ్చే ప్రజలు గత్యంతరం లేక సరిగా పనిచేయని వ్యాయామ పరికరాలను అలాగే ఉపయోగిస్తున్నారు.
ఆధునీకరణ పేరిట ఆట వస్తువుల ఏర్పాటు
నిర్వహణ లేక నీరసించిపోతున్న ఓపెన్‌జిమ్‌లు పర్యవేక్షణ లోపంతో పాడైపోతున్న పరికరాలు
మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలంటున్న పట్టణ ప్రజలు
మున్సిపాలిటీ ఓపెన్ జిమ్‌లు జనాభా
సూర్యాపేట 09 1,33,339
కోదాడ తొలగించారు 75,093
హుజూర్‌నగర్ 02 35,850
‘కసరత్తు’కు కషా్టలు
‘కసరత్తు’కు కషా్టలు