
జాన్‌పహాడ్ పంచాయతీ కార్యదర్శి అరెస్టు
పాలకవీడు: మండలంలోని జాన్‌పహాడ్ పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్యను గురువారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ జాన్‌పహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలంటే పంచాయతీ కార్యదర్శి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డులు వైరల్ కావడం, పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్యదర్శి వెంకయ్యను అదుపులోకి తీసుకుని శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
ఇంకుడు గుంతలతో
భూగర్భ జలాలు పెంపు
మద్దిరాల : ఇంకుడు గుంతలతో భూగర్భజల నీటిమట్టం పెరుగుతుందని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. గురువారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో నిర్మించిన ఇంకుడు, రీచార్జ్ గుంతలను పరిశీలించి మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, బోరుబావుల చుట్టూ రీచార్జ్ గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, ఏపీఓ గుండు వెంకన్న, ఈసీ చారి, పంచాయతీ కార్యదర్శి ఉమ, టీఏ మురళి ఉన్నారు.