
కొత్త కార్డులకు సన్న బియ్యం
సూర్యాపేట : కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరింది. ఎన్నికల హామీలో భాగంగా గతనెలలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 36,812 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. పదేళ్ల తర్వాత కార్డులు వచ్చాయని సంబరపడిన లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి ఒకేసారి కోటా పంపిణీ చేసింది. అయినప్పటికీ కొత్త కార్డుదారులకు రేషనన్ బియ్యం తీసుకునే అవకాశం దక్కలేదు. దీంతో కొత్తకార్డుదారులకు సెప్టెంబర్ నుంచి మొదటి సారిగా కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా వచ్చేనెల 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రేషన్ షాపులకు కోటా సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
అందనున్న పథకాలు
జిల్లా వ్యాప్తంగా గతంలో 3,26,057 రేషన్ కార్డులు ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా 36,812 కార్డులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రేషన్ కార్డులేక ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి చాలా మంది పేదలు దూరమవుతున్నారు. దీంతోపాటు వారి పిల్లల చదువుల విషయంలోనూ రేషన్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు కూడా దక్కని పరిస్థితులు నెలకొంటున్నాయి. చివరికి ఆపద సమయంలో ఆరోగశ్రీ ద్వారా వైద్యసేవలను కూడా పొందలేక పేదలు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పేదల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అడ్డంకులు తప్పాయి.
సెప్టెంబర్ ఒక టవ తేదీ నుంచి పంపిణీ
ఫ మొదటిసారి 36,812
కుటుంబాలకు బియ్యం
ఫ కొత్త కార్డుల మంజూరుతో పథకాల వర్తింపునకు తొలగిన అడ్డంకులు