
సీనియర్ సిటిజన్స్‌ను గౌరవించాలి
చివ్వెంల : సీనియర్ సిటిజన్స్‌ను ప్రతిఒక్కరూ గౌరవించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్‌కౌసర్ అన్నారు. ప్రపంచ సీనియ ర్ సిటిజన్స్ డే సందర్భంగా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని శ్రీఅన్నపూర్ణ చాటిటబుల్ ట్రస్ట్‌లో వృద్ధులను కలిసివారి సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. వృద్ధుల సమస్యలతోపాటు ఆశ్రమానికి దారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.రాజు, డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్ సభ్యులు వెంకటేశ్వర్‌రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్