
స్వచ్ఛ పాఠశాలలకు ప్రోత్సాహం
దరఖాస్తు చేశాం
తిరుమలగిరి (తుంగతుర్తి): సర్కారు పాఠశాలల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ స్వచ్ఛ పాఠశాలలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు అందజేస్తోంది. ప్రతి సంవత్సరం పాఠశాలల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపికై న వాటికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పురస్కారాలకు 2025–26 విద్యా సంవత్సరానికి పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విద్యా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్వచ్ఛ పాఠశాలలను ఎంపిక చేసేందుకు నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకొని రేటింగ్ ఇవ్వనున్నారు.
ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు
దరఖాస్తు చేసుకునే స్కూళ్లు వివిధ అంశాలను నమోదు చేయడంతో పాటు సౌకర్యాలకు సంబంధించిన ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత– పచ్చదనం పెంపు, తాగు నీటి వసతి, ఇంకుడు గుంతలు–మూత్రశాలల నిర్మాణం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వడ్డించడం వంటి నాలుగు అంశాలపై ఇచ్చిన 60 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసి ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. మొత్తం 125 మార్కులు కేటాయించనున్నారు. 90 శాతానికిపైగా మార్కులు సాధించిన పాఠశాలలకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు.
క్షేత్ర స్థాయి పరిశీలనకు బృందాలు
ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపనున్నారు. పరిశీలించి మార్కులు ఖరారు చేసి రేటింగ్ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లా నుంచి 8 పాఠశాలలను రాష్ట్ర స్థాయి పరిశీలనకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేసి 5 స్టార్ రేటింగ్‌లు సాధించిన 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. నగదు పురస్కారం కోసం దరఖాస్తు చేసుకునేలా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు విద్యా శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది.
స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్ కోసం మోడల్ స్కూల్ నుంచి దరఖాస్తు చేశాం. మా పాఠశాలలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. స్వచ్ఛతతో పాటు పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు చేయడానికి కృషి చేస్తున్నాం.
– సంజీవ్‌కుమార్, అనంతారం మోడల్ స్కూల్, తిరుమలగిరి మండలం
ఫ నగదు పురస్కారాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ఫ ఉత్తర్వులు జారీచేసిన విద్యా శాఖ
ఫ రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 30 వరకు గడువు
ఫ ఎంపికై న పాఠశాలలకు
రూ.లక్ష చొప్పున నగదు బహుమతి