
ఉత్సవం.. అప్రమత్తం
సూర్యాపేటటౌన్ : ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీల సభ్యులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు సూచిస్తున్నారు. గణేష్ మండపాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను జారీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆన్‌లైన్‌లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికోసం ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్టించే విగ్రహాల ఎత్తు, మండపం ప్రదేశం, నిమజ్జనం తేదీ, నిమజ్జనం ప్రదేశం తదితర వివరాలతో దరఖాస్తులో సమర్పించాల్సి ఉంటుంది. అన్ని సక్రమంగా ఉంటే అనుమతితోపాటు క్యూ ఆర్ కోడ్‌ను జారీ చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో..
మండపం ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతికి పోలీస్ స్టేషన్ తిరగాల్సిన పని లేదు. https-://po liceportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో అనుమతి కోసం వివరాలను నమోదు చేసుకోవాలి. ఇదిరకంగా దరఖాస్తు ప్రక్రియ. వీటి ఆధారంగానే అనుమతులు జారీ అవుతాయి. అనంతరం ఆయా మండపాల్లో పోలీసుల అనుమతి పత్రం, క్యూఆర్ కోడ్, పోలీస్ సూచనలను విధిగా ప్రదర్శించాలి.
పోలీసుల సూచనలు ఇవే..
● గణేష్‌మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదే.
● ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
● నిర్దేశించిన సమయానికి నిమజ్జనం
పూర్తిచేయాలి.
● గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
● మండపం స్థలం కోసం సంబంఽధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.
● రాత్రి 10గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.
● డీజేలు ఏర్పాటు చేయరాదు.
● గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకరమైన నృత్యాలు చేయడం, అన్యమతస్తులను కించపరిచేలా ప్రసంగించడం, పాటలు పాడటం పూర్తిగా నిషేధం.
● ఎవరికై నా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీస్‌వారికి లేదా డయల్ 100కు సమాచారం అందించాలి.
గణేష్ నవరాత్రులకు
జాగ్రత్తలు తప్పనిసరి
ఫ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి
పొందాల్సిందే..
ఫ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
ఫ రూ.500 డీడీ చెల్లిస్తేనే విద్యుత్ కనెక్షన్
ఫ సూచనలు పాటించాలంటున్న పోలీసులు