
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మరో సుపారీ మర్డర్‌కు ప్లాన్ చేసిన ఘటన స్థానకంగా కలకలం రేపింది. ఓ బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని హత్య చేసేందుకు ఒక సుపారీ గ్యాంగ్ కారులో వెంబడించింది. దాంతో అప్రమత్తమైన ఆ ముగ్గురు బైక్ దిగి వైన్స్‌లోకి పరిగెత్తడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆ ముగ్గురు.
సుపారీ గ్యాంగ్‌ను వైన్స్‌లో ఉన్నవాళ్లు వెంబడించడంతో వారు వచ్చిన కారులోనే పరారయ్యారు. రెండు నెలల క్రితం కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించగా, తాజాగా మరోసారి హత్యాయత్నం పథకం జరగడంతో సూర్యాపేటలో కలకలం రేగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అనే ప్రశ్న స్థానికంగా జీవిస్తున్న వారిలో మొదలైంది.