
సీఎంఆర్ బకాయిలు పూర్తిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : సీఎంఆర్ బకాయిలు 2024–25 వానాకాలం సీజన్‌కు సంబంధించినవి సెప్టెంబర్ 12 నాటికి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2024–25 వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం వేగవంతంగా మిల్లింగ్ చేసి ఇచ్చిన గడువులోగా సీఎంఆర్ పూర్తి చేయాలని సూచించారు. పౌర సరఫరా అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేపట్టాలని, రోజువారీ నివేదికలను తనకు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ మోహన్‌బాబు, ఏఎస్‌ఓ శ్రీనివాసరెడ్డి, డీటీ రాజశేఖర్, ఆర్‌ఐలు శ్రీకాంత్, ప్రమోద్, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
నడిగూడెం : పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంట గది, హాస్టల్ స్టోర్‌ను తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. వానాకాలం సీజన్‌లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట కోదాడ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయ మనోహరి, ఎంపీడీఓ మల్సూర్‌నాయక్, ఎంపీఓ విజయకుమారి, ప్రిన్సిపాల్ వాణి, డాక్టర్.హరినాఽథ్, హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి, ఏఎన్‌ఎం సుజాత, ఆశా కార్యకర్తలు సైదమ్మ, సునిత, స్టాఫ్‌నర్స్ నాగలక్ష్మి, ఉన్నారు.
మెడికల్ షాపు తనిఖీ
తుంగతుర్తి: అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో గల మెడికల్ దుకాణాన్ని పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్‌ఎంపీ చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మహిళకు వైద్యం చేసేటప్పుడు ఎలాంటి మందులు ఉపయోగించారో పరిశీలించారు. వారివెంట సీఐ నరసింహారావు, ఎస్‌ఐ క్రాంతికుమార్ ఉన్నారు.

సీఎంఆర్ బకాయిలు పూర్తిచేయాలి

సీఎంఆర్ బకాయిలు పూర్తిచేయాలి