
యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ పర్యటనలో అపశృతి...
పొనుగోడు పీఏసీఎస్ గోదాంను
పరిశీలిస్తున్న కలెక్టర్
గరిడేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులతో
మాట్లాడుతున్న కలెక్టర్
గరిడేపల్లి : యూరియా విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని సహకార సంఘం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణాన్ని పరిశీలించి యూరియా నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పొనుగోడు గ్రామంలోని జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. పలు రకాల ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పొనుగోడు పాఠశాలలో ఒకే ఆవరణంలో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు ఉండడంతో రెండు పాఠశాలలకు కలిపి వంటలు వండించాలని సూచించారు. అనంతరం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సహకార సంఘం, ప్రభుత్వ పాఠశాలలు, నర్సరీ, ఫర్టిలైజర్ దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆరోగ్య కేంద్రానికి ఎంత మంది అవుట్ పేషెంట్స్ వస్తునా ్నరని వైద్యాధికారి నరేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్తుండగా అసంపూర్తిగా ఉన్న సీ్త్రశక్తి భవనం విషయం విలేకరులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే డీఆర్‌డీఓకు ఫోన్ చేసి అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నర్సరీని పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండ కవిత, ఎంపీడీఓ సరోజ, ఎస్‌ఐ చలికంటి నరేష్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ ఏఈలు కళ్యాణ్, సిద్ధార్థ, ఆర్‌ఐలు ప్రవీణ్, రాంబాబు, ఏపీఎం అజయ్, ఏపీఓ సురేష్, ఎంపీఓ ఇబ్రహీం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గరిడేపల్లి మండలంలో నాలుగు గంటలకుపైగా సమయాన్ని కేటాయించిన కలెక్టర్ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. గరిడేపల్లిలో ఎరువుల దుకాణం ఎదుట మండల వ్యవసాయ అధికారి ప్రీతమ్‌కుమార్ వాహనం నుంచి దిగుతున్న సమయంలో వాహనం కదలడంతో ఆయన కాలిపై వాహనం టైర్ ఎక్కడంతో గాయమైంది. దీంతో ఆయనకు దగ్గరుండి చికిత్స చేయించాలని ఆర్ రాంబాబుకు కలెక్టర్ సూచించారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు