
బాధితులతో స్నేహపూర్వకంగా మెలగండి
పెన్‌పహాడ్ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల పోలీసు సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీసు స్టేషన్ ఆవరణలో సిబ్బంది కవాతు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం రికార్డులు, పోలీస్ స్టేషన్ మ్యాప్, గ్రామాల హద్దులు, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్లు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ పరిధిలో గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో నిరంతరం పెట్రోలింగ్, తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళా కేసుల్లో ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. మానవ అక్రమ రవాణా, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ, సీసీ కెమెరాల ఏర్పాటు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఎస్‌ఐ గోపికృష్ణ, డీసీఆర్బీ ఎస్‌ఐ యాకూబ్, డీసీఆర్బీ సిబ్బంది అంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ