ప్రతిరోజు జూనియర్ కాలేజీలోని ఓపెన్ జిమ్‌కు ఉదయం, సాయంత్రం వేళల్లో వస్తుంటాం. కసరత్తు చేసే పరికరాలు పాడైపోయాయి. అవి సరిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలి.
– బొర్ర పుల్లయ్య,
చర్చి కంపౌండ్, సూర్యాపేట
చందాలు వేసుకుని
పరికరాలకు రిపేర్ చేయించాం
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యాపేటలోని ఓపెన్ జిమ్‌కు వస్తుంటాం. పరికరాలు పాడవడంతో తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడానికి కష్టమవుతోంది. ఒకసారి ఓపెన్ జిమ్‌కు వచ్చే వాళ్లం చందాలు వేసుకొని రిపేరు చేయించాం. అవి మళ్లీ పాడైపోయాయి. అధికారులు స్పందించి పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవి బిగించి వినియోగంలోకి తేవాలి.
– పడిశాల ఊశయ్య, సూర్యాపేట
మరమ్మతులు చేపట్టాలి