
పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా
సూర్యాపేటటౌన్ : ఏఆర్‌లో హెడ్ కానిస్టేబుల్ రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాధిత కుటుంబానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ బీమా చెక్కు అందజేశారు. అదేవిధంగా నూతనకల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సోమాని నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా.. బాధిత కుటుంబ సభ్యులకు పోలీసు చేయూత పథకం ద్వారా రూ.2లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.