
మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
హుజూర్‌నగర్ : పేదలకు విలువైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పారసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్ ప్రాంతీయ వైద్యశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ 3.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఓపీ బ్లాక్ నూతన విభాగం, ధోబి ఘాట్, పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన చేశారు. రూ 1.25 కోట్ల వ్యయంతో ఆస్పత్రిలో నిర్మించిన డయాలసిస్, రక్త నిధి కేంద్రాలను ప్రారంభించారు. రూ.3 కోట్లతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్, డీసీహశ్రీచ్‌ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయ మనోహరి, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సామాజిక న్యాయం వైపు ప్రభుత్వం అడుగులు
హుజూర్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం డివిజన్ ఎలక్ట్రిసిటి ఉద్యోగుల ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యుత్ ఎస్‌ఈ ప్రాంక్లిన్, డీఈలు వెంకట కిష్ణయ్య, శ్రీనివాస్, ఏడీఈలు, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర నీటిపారుదల, పారసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి