
జలదిగ్బంధంలో కోడూరు
అర్వపల్లి: కురుస్తున్న వర్షాలకు జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం–సంగెం రహదారిపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఐదు రోజులుగా కోడూరు గ్రామం జలదిగ్బంధంలో ఉంది. ఆదివారం కురిసిన వర్షానికి కోడూరు వద్ద వాగు వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోడూరు వాసులు అటు సంగెం మీదుగా, ఇటు కోడూరు, కొమ్మాల మీదుగా ఎటు వెళ్లాలన్నా వాగులు అడ్డంకిగా మారాయి. దీంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి అత్యవసర పనులు ఉన్నవారిని వాగు దాటిస్తున్నారు. సోమవారం గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా.. ట్రాక్టర్‌పై వాగు దాటించి సూర్యాపేటకు తీసుకెళ్లారు.
ఫ వాగు దాటేందుకు గ్రామ పంచాయతీ
ఆధ్వర్యంలో ట్రాక్టర్ ఏర్పాటు