
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
సూర్యాపేట: విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, భారత మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని సోమవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌కే ప్రసాద్‌తో పాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనర్ రమేష్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడాకారులకు అకాడమీని అందుబాటులోకి తీసుకొచ్చి న ఎంఎస్‌కే ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో సూర్యాపేట ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాలని, పట్టుదలతో సాధన చేస్తే ఏ రంగంలోనైనా విజయం తధ్యమన్నారు. ఈ క్రికెట్ అకాడమీ రెండో సెక్షన్‌ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడల్లో రాణించి సూర్యాపేట పేరును జాతీయ స్థాయిలో నిలపాలని కోరారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి