
అనువైన స్థలంలోనే వ్యవసాయ కళాశాల
హుజూర్‌నగర్ : ప్రజలకు అన్ని రకాలుగా అనువుగా ఉన్న స్థలంలోనే వ్యవసాయ కళాశాల నిర్మిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాల నిర్మాణానికి హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 1041లో ఉన్న ప్రభుత్వ భూములను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల విస్తీర్ణం, వాటి స్థితిగతులను మంత్రికి, అధికారులకు ఆర్‌డీఓ శ్రీనివాసులు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. వ్యవసాయ కళాశాల నిర్మాణానికి హుజూర్‌నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1041లో గల ప్రభుత్వ భూములు అనువుగా ఉన్నాయని, రోడ్డు సౌకర్యం కూడా ఉందని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఈ భూములకు సాగు నీరు సైతం అందుతోందని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జానయ్య, డీన్ ఝాన్సీరాణి, డీఎస్‌ఎ వేణుగోపాల్‌రెడ్డి, లింగయ్య, ఎస్పీ కే నరసింహ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఏఓ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి