
ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకుందాం
కోదాడ: ప్రభుత్వ స్కూళ్లు మూతపడకుండా కాపాడుకోవడం మన బాధ్యత అని పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఆ సంస్థఽ జిల్లా అధ్యక్షుడు ధనమూర్తి నివాసంలో జరిగిన సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడారు. జిల్లాలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, పాఠశాలలను ఇరుకై న గదుల్లో కాకుండా విశాలమైన భవనాల్లో ప్రారంభించాలని కోరారు. విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని కోరారు. సమావేశంలో వీరారెడ్డి, వెంకట రమణ, వీరబాబు, ఖాజామియా,రాంమూర్తి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటనారాయణ, కరుణాకర్ పాల్గొన్నారు.
ఫ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అల్గుబెల్లి నర్సిరెడ్డి