
పోరుబాటను జయప్రదం చేయాలి
సూర్యాపేట అర్బన్ : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి నిర్వహించనున్న సీపీఎం పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్‌లో జరిగిన సీపీఎం సూర్యాపేట రూరల్, త్రీ టౌన్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసి, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, సీపీఎం త్రీ టౌన్ కార్యదర్శి చిట్లంకి యాదగిరి, సీపీఎం రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, మండల కమిటీ సభ్యులు నారాయణ వీరారెడ్డి, నల్ల మేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.