
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
మునగాల : సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదమున్నందున ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్‌ఓ జి.చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం ఆయన మునగాల మండలం కలకోవలో కొనసాగుతున్న ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో సేవలందించాలన్నారు. డెంగీ సోకిన వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నిరంతర పర్యవేక్షణతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వైద్య, గ్రామ పంచాయతీ సిబ్బంది భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్, సూపర్‌వైజర్ జయమ్మ, ఏఎన్‌ఎంలు నాగమణి, శాంతమ్మ, లలిత, నర్సమ్మ, హెల్త్ అసిస్టెంట్లు లింగం రామకృష్ణ, కొర్రా లింగయ్య సిబ్బంది పాల్గొన్నారు.