
యాదగిరీశుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రఽభాత సేవ, ఆరాధన.. గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన తదితర పూజలు నిర్వహించారు. రాత్రికి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
పూజలు చేసి హారతి ఇస్తున్న అర్చకుడు