
వరద పాఠం నేర్వలే..!
60 ఫీట్ల రోడ్డు జలమయంగా..
గతేడాది సెప్టెంబర్‌లో భారీ వర్షం వచ్చినప్పుడు 60 ఫీట్ల రోడ్డు వద్ద నాలా పొంగడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించి స్థానికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం నాలాలో మట్టి తీసి శుభ్రం చేయడంతో సమస్య కొద్దివరకు పరిష్కారమైంది. నాలాలను పెద్దగా చేసి ఎప్పటికప్పుడు అడ్డంకులను తొలగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని స్థానికులు అంటున్నారు.
సూర్యాపేట అర్బన్ : భారీ వర్షం వస్తేచాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో ఆయా కాలనీల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి. అయితే గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు సుందరయ్య నగర్ కాలనీతోపాటు ఆర్కే గార్డెన్ సమీపంలోని వివిధ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సద్దుల చెరువు అలుగు పోయడంతో సుందరయ్య నగర్ కాలనీలోకి నీరు వచ్చి ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. సద్దుల చెరువు అలుగు నీరు పారే కాలువ చెత్తాచెదారం మట్టితో కూరుకుపోవడంతో వరదనీరు సరిగా పారక ఇళ్లలోకి వస్తుంది. కాలువపై ఉన్న బ్రిడ్జిల దగ్గర చిన్నచిన్న గూనలకు బదులు పెద్ద గూనలు వేస్తే వరదనీరు సాఫీగా ముందుకెళ్తుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం.. భారీ వర్షం పడితే వరద నీరు తమ ఇళ్లలోకి వస్తుందని, వెంటనే అధికారులు స్పందించి ముందస్తుగా వరద ముంపు ముప్పు తప్పేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఎస్సీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నాలా అస్తవ్యస్తం
ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లే రోడ్డు వద్ద గల నాలా ప్రమాదకరంగా తయారైంది. బ్రిడ్జి కింద చిన్న చిన్న గూనలు వేయడంతో వాటిలో వరదనీరు సాఫీగా పోవడంలేదు. భారీ స్థాయిలో వరద వచ్చినప్పుడు వరదనీరు పైకివచ్చి బ్రిడ్జి కోతకు గురవుతోంది. పైగా ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ చిన్నపాటి చెరువులా తయారవుతుంది. గతంలో చిన్నగా ఉన్న కాలువని పెద్దగా చేయడంతో ప్రస్తుతం కాస్త ఉపశమనం కలిగిందని స్థానికులు అంటున్నారు. అలాగే ఎస్పీ ఆఫీస్ ముందు గల ఈదులవాగు మీద చిన్నచిన్న గూనలు వేసి నిర్మించడంతో ఇరుకుగా మారింది. దీంతో ఎస్వీ కాలేజ్ వెనుక ప్రాంతమైన ఆర్కే నగర్ జలమయంగా మారుతుంది. బ్రిడ్జి మీద నుంచి వెళ్లే మామిళ్లగడ్డ, సీతారాంపురం, ఇందిరమ్మ కాలనీ రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈదులవాగు మీద పెద్ద బ్రిడ్జి నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
‘పేట’కు ముంపు ముప్పు తప్పేదెలా..?
ఫ భారీ వర్షాలకు మునుగుతున్న
లోతట్టు ప్రాంతాలు
ఫ గతేడాది ఇచ్చిన హామీలు నెరవేర్చని మున్సిపల్ యంత్రాంగం
ఫ నామమాత్రపు పనులతోనే
సరిపెడుతున్న వైనం
ఫ వర్షాలు కురుస్తుండడంతో ఆందోళనలో ముంపు కాలనీల ప్రజలు

వరద పాఠం నేర్వలే..!

వరద పాఠం నేర్వలే..!