
సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి
చివ్వెంల : సీజనల్ వ్యాధులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం చివ్వెంల పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, సిబ్బంది వివరాల గురించి వైద్యాధికారి భవానిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో గ్రామాల్లోని ప్రజలకు ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఆయన వెంట హెల్త్ సూపర్‌వైజర్లు, సిబ్బంది ఉన్నారు.
కేజీబీవీ సమస్యను
కలెక్టర్‌కు వివరిస్తాం
అర్వపల్లి: భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి అర్వపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం జలమయమై బాలికలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని డీఈఓ అశోక్ అన్నారు. భారీ వర్షానికి జలమయమైన అర్వపల్లి కేజీబీవీని శుక్రవారం డీఈఓ అశోక్, జీసీడీఓ పూలన్ సందర్శించారు. కేజీబీవీలో ఉన్న బాలికలను తాత్కాలికంగా ఇళ్లకు పంపించారు. నీళ్లు తగ్గే వరకు బాలికలు ఇళ్లకు వెళ్లాలని సూచించారు. వారి వెంట ఎస్‌ఓ నాగరాణి, అధ్యాపకులు, సీఆర్‌టీలు, సిబ్బంది ఉన్నారు.
పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలి
మునగాల: గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చి పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన మునగాలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కుంటల రమేష్‌దీనదయాళ్, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పి.రవీందర్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి

సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి