స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి

Aug 9 2025 8:40 AM | Updated on Aug 9 2025 8:40 AM

స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి

స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి

భానుపురి (సూర్యాపేట) : స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కె.నరసింహతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవం ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్‌ శాఖ పరేడ్‌కు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జాబితా తయారు చేయాలని సూచించారు.

డ్రగ్స్‌ను నిర్మూలించాలి

అనంతరం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎన్‌ కార్డ్‌, నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌పై ఎస్పీ నరసింహతో కలిసి ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. ఈనెల 13న యాంటీ డ్రగ్స్‌పై పాఠశాలలు, కళాశాలలు యూనివర్సిటీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం

అనంతరం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. వానాకాలం ప్రారంభమైనందున ఇసుక సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ముందుగా ఇసుక బజారుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలన్నారు. నాగారం మండలం పేరబోయినగూడెం అప్రోచ్‌ రోడ్డుకు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న జానపహాడ్‌, బెట్టెతండా, ముత్యాల బ్రాంచ్‌ కెనాల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్లకు, మున్నేరు వాగు రక్షణ గోడకు ఇరిగేషన్‌ శాఖకు ఇసుక అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ఎస్పీ కె.నర్సింహ, అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు, డీఎఫ్‌ఓ సతీష్‌ కుమార్‌, డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవ్‌, డీపీఓ యాదగిరి, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్‌ నాయక్‌, అబ్కారీ సూపరింటెండెంట్‌ లక్ష్మానాయక్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ అధికారి జయప్రకాశ్‌రెడ్డి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాసరాజు, సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ హన్మంతరెడ్డి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement