
అంతటా మోస్తరు వర్షం
భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మోస్తరు వర్షం కురిసింది. దాదాపు అన్ని మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. ఐదారు రోజులుగా తీవ్ర ఉక్కపోత, ఎండ తీవ్రత ఉంది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఒక్కసారిగా మబ్బులు పట్టి వర్షం కురిసింది. చాలాచోట్ల రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరగా.. పలు మండలాల్లో చెరువులు, కుంటల్లోకి వాగులు సాగాయి. జిల్లాలో అత్యధికంగా నడిగూడెం మండలంలో 101.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మేళ్లచెరువు మండలంలో 16.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి 53.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వర్షపాతం వివరాలు
మండలం వర్షపాతం
నాగారం 65.2
తిరుమలగిరి 36.1
తుంగతుర్తి 36.4
మద్దిరాల 45.0
నూతనకల్ 59.9
జాజిరెడ్డిగూడెం 83.9
సూర్యాపేట 40.3
ఆత్మకూర్(ఎస్) 62.5
మోతె 58.6
చివ్వెంల 69.1
పెన్‌పహాడ్ 31.5
మునగాల 58.7
నడిగూడెం 01.0
అనంతగిరి 56.4
కోదాడ 88.5
చిలుకూరు 72.0
గరిడేపల్లి 48.0
నేరేడుచర్ల 34.6
పాలకవీడు 32.8
మఠంపల్లి 40.7
హుజూర్‌నగర్ 42.4
మేళ్లచెరువు 16.7
చింతలపాలెం 42.7